'హోదా' నిరసనలు ఇలా తెలపండి.. | tweet the demands for special Category Status writes KVP in a open letter | Sakshi
Sakshi News home page

'హోదా' నిరసనలు ఇలా తెలపండి..

Jan 25 2017 4:59 PM | Updated on Sep 5 2017 2:06 AM

రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను సాధించుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తమ నిరసనలు తెలపాలని కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలిపారు.


న్యూఢిల్లీ :
రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను సాధించుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తమ నిరసనలు తెలపాలని కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. దీనికి ట్విట్టర్ను వేదికగా ఉపయోగించుకోవాలని బుధవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో కేవీపీ పేర్కొన్నారు. ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రత్యేక హోదా పోరాడటాన్ని ఉధృతం చేయాలని తెలిపారు.

విభజన హామీలను నెరవేర్చడంలో ప్రధాని నరేంద్రమోదీ అలసత్వంగా వ్యవహరిస్తున్నారని కేవీపీ మండిపడ్డారు. 68వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ట్విట్టర్లో 140 అక్షరాలను ఓ ఆయుధంగా వాడి కేంద్రంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.  రాష్ట్రానికి రావల్సిన న్యాయపరమైన హక్కులకు సంబంధించి అంశాలు కేంద్రానికి తెలిసేలా అందరూ ఒకేలా ఈ క్రింది హ్యాష్ ట్యాగ్లు ఇవ్వాలని కోరారు.

#WeDemandSpecialCategoryStatusForAP
#CompletionOfPolavaramProject
#SpecialPackageForBackwardRegions
#FundForCapitalCity
#DistributionOfAssetsAsPerSchedule9&10
#FulfillingRevenueDeficit
#Vizag-ChennailndustrialCorridor
#RailwayZoneAtVizag
#PortAtDugarajapatnam
#SteelPlantAtY.S.RKadapaDist


ట్విట్ చేసే వారు పై హ్యాష్ ట్యాగ్లతో పాటూ ప్రధాని నరేంద్రమోదీ @narendramodi , పీఎంవో యూనియన్ @PMOIndia, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ @arunjaitley, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు @MVenkaiahNaidu, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు@ncbn  కు ట్యాగ్ చేయాలని కోరారు.  తెలుగు ప్రజలు 140 అక్షరాల్లో ముగించేలా తమ నిరసన మెసేజ్తో పాటూ హ్యాష్ ట్యాగ్తో కనీసం ఎవరినైనా ఒకరిని ట్యాగ్ చేయాలని తెలిపారు.

రోజుకు కనీసం రెండు నిమిషాలైనా కేటాయించి కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను సాధించే వరకు తమ నిరసనలను ట్విట్టర్ ద్వారా తెలపాలని తెలుగు ప్రజలందరికి కేవీపీ విజ్ఞప్తి చేశారు.

Advertisement

పోల్

Advertisement