
లారీ, టిప్పర్ ఢీ
పాస్పరస్ లోడ్‌తో చెన్నై నుంచి వస్తున్న లారీ.. నెల్లూరు జిల్లా గూడూరు వద్ద ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొంది.
నెల్లూరు(గూడూరు): పాస్పరస్ లోడ్‌తో చెన్నై నుంచి వస్తున్న లారీ.. నెల్లూరు జిల్లా గూడూరు వద్ద ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం ఉదయం గూడురు రహదారి పై జరిగింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ కత్తుల శేఖర్ లారీలో ఇరుక్కుపోవడంతో నరకయాతన అనుభవించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని బయటికి తీసి 108లో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అతని రెండు కాళ్లు నుజ్జు నుజ్జయ్యాయి.