రాష్ట్రం, కేంద్రంలోనూ టీఆర్ఎస్ కీలకపాత్ర: కేకే
రాష్ట్రంలో, కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కీలక పాత్ర పోషిస్తుందని టీఆర్‌ఎస్ నేత కే కేశవరావు అన్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో, కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కీలక పాత్ర పోషిస్తుందని టీఆర్‌ఎస్ నేత కే కేశవరావు అన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పటికే కేంద్రంలో కొన్ని పార్టీలతో చర్చలు ప్రారంభించామని కేకే తెలిపారు.
తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరిస్తుందని, పూర్తి మెజార్టీతోనే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే విశ్వాసాన్ని కేకే వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో ఎన్నడూలేని విధంగా పోలింగ్ శాతం పెరగడం టీఆర్‌ఎస్‌కే అనుకూలమని కేకే అన్నారు.
సరాసరి పోలింగ్ 72 శాతం నమోదైందని ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా నివేదిక ప్రకారం తుది పోలింగ్ శాతం 77 నుంచి 80 శాతం దాకా నమోదయ్యేవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు.