స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొందాం : విజయారెడ్డి | TRS Leader Vijaya reddy participates in Swachha Hyderabad | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొందాం : విజయారెడ్డి

May 29 2015 7:07 PM | Updated on Sep 3 2017 2:54 AM

హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఖైరతాబాద్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకురాలు పి. విజయారెడ్డి అన్నారు.

హైదరాబాద్‌ :  హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఖైరతాబాద్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకురాలు పి. విజయారెడ్డి అన్నారు. శుక్రవారం పంజగుట్ట డివిజన్ పరిధిలోని తబేలా బస్తీలో ఆమె స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. తబేలాబస్తీలో ఉన్న మజీద్‌లో ప్రార్థనల అనంతరం పలువురు ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొని, శ్రమదానం చేసి ఆయా పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. మట్టికుప్పలు, చెత్తను పూర్తిగా తొలగించారు. ఈ సందర్భంగా విజయారెడ్డి మాట్లాడుతూ.. స్వచ్ఛ హైదరాబాద్ ఓ బృహత్తర కార్యక్రమమని, దీన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. మన పరిసరాలు బాగుంటేనే మనం బాగుంటామని, ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement