అభయగోల్డ్ ఆస్తుల స్వాధీనం | Tragedy of Sri Abhaya Gold scam victims | Sakshi
Sakshi News home page

అభయగోల్డ్ ఆస్తుల స్వాధీనం

Mar 2 2014 12:40 AM | Updated on Sep 4 2018 5:07 PM

అధిక వడ్డీల పేరుతో కోట్లాది రూపాయల డిపాజిట్లు వసూలు చేసి ప్రజలకు శఠగోపం పెట్టిన అభయగోల్డ్‌కు చెందిన సుమారు వందల ఎకరాల భూములతో పాటు భారీ ఎత్తున ఇతర ఆస్తులను జప్తు చేసినట్లు సీఐడీ అదనపు డీజీ క్రిష్ణప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: అధిక వడ్డీల పేరుతో కోట్లాది రూపాయల డిపాజిట్లు వసూలు చేసి ప్రజలకు శఠగోపం పెట్టిన అభయగోల్డ్‌కు చెందిన సుమారు వందల ఎకరాల భూములతో పాటు భారీ ఎత్తున ఇతర ఆస్తులను జప్తు చేసినట్లు సీఐడీ అదనపు డీజీ క్రిష్ణప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
 
 ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన కూకట్ల శ్రీనివాస్ 2008లో శ్రీఅభయ గోల్డ్ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. కుటుంబసభ్యులను, బంధువులను డెరైక్టర్‌లుగా నియమించాడు. రాష్ట్రవ్యాప్తంగా 140 బ్రాంచీలను, మరో 16 ఉపబ్రాంచీలను తెరిచాడు. ఆకర్షణీయమైన కమిషన్లను చూపించి ఏజెంట్లను నియమించుకున్నాడు. వివిధ స్కీమ్‌ల పేరుతో పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement