విశాఖలో నేడు హిజ్రాల అందాల పోటీలు | today in vishaka hizras Pageantry | Sakshi
Sakshi News home page

విశాఖలో నేడు హిజ్రాల అందాల పోటీలు

May 1 2014 12:38 AM | Updated on May 3 2018 3:17 PM

విశాఖ సాగరతీరం గురువారం సాయంత్రం హిజ్రాల అందచందాల ప్రదర్శనకు వేదికగా నిలవనుంది.

విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ సాగరతీరం గురువారం సాయంత్రం హిజ్రాల అందచందాల ప్రదర్శనకు వేదికగా నిలవనుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ‘ట్రాన్స్ క్వీన్’ పేరిట ట్రాన్స్‌జెండర్ (హిజ్రాలు) అందాల పోటీలు ఇక్కడ జరగబోతున్నాయి. 25 మంది హిజ్రాలు వీటిలో పాల్గొంటున్నారు. నాంది సర్వీస్ సొసైటీ, మూన్‌పవర్ ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను సొసైటీ అధ్యక్షుడు సూరాడ ఎల్లాజీ, సినీ నటి పూర్ణిమ, ప్రముఖ కొరియోగ్రాఫర్ అమిత్ పాండే బుధవారం విశాఖలో మీడియాకు వెల్లడించారు.

 దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు వంద ఎంట్రీలు రాగా, 25 మంది హిజ్రాలను ఎంపిక చేశామని ఎల్లాజీ తెలిపారు. వీరికి గురువారం సాయంత్రం 5 గంటలకు సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు.

ఈ పోటీలకు హీరోయిన్ కామ్న జెఠ్మలానీ, నేపథ్య గాయకుడు రేవంత్, సారు శిల్ప, రింగ్ డ్యాన్సర్ అంబికా, సినీ ఆర్టిస్ట్ చందుతో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పా రు. న్యాయనిర్ణేతలుగా ఫొటోగ్రాఫర్ అగర్వాల్, సినీ నటి పూర్ణిమ, లెబెన్‌షిల్ఫే డెరైక్టర్ సరస్వతీదేవి వ్యవహరిస్తారని తెలిపారు. కాగా, జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,400 మంది హిజ్రాల సంక్షేమం కోసం తమ సొసైటీ పని చేస్తున్నట్టు ఎల్లాజీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement