ఇటుకబట్టీ కూలి ముగ్గురి దుర‍్మరణం | three workers dies over Bricks collapse | Sakshi
Sakshi News home page

ఇటుకబట్టీ కూలి ముగ్గురి దుర‍్మరణం

Oct 4 2017 2:27 PM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా రామకుప‍్పం మండలం రాజుపేట వద‍్ద ఇటుక బట్టీ కూలి ముగ్గురు మృతి చెందారు.

సాక్షి, రామకుప‍్పం: చిత్తూరు జిల్లా రామకుప‍్పం మండలం రాజుపేట వద‍్ద ఇటుక బట్టీ కూలి ముగ్గురు మృతి చెందారు. కర్ణాటక సరిహద్దులోని రాజుపేట శివారులో ఇటుకబట్టీలో పనిచేసే కార్మికులు మంగళవారం రాత్రి బట్టీ పక‍్కనే పందిరి వేసుకుని నిద్రించారు. జోరు వానకు తడిసిన ఇటుకబట్టీ తెల్లవారుజామున ఒక‍్కసారిగా ఒరిగిపోయి కూలిపోవడంతో నిద్రిస్తున‍్న ముగ్గురు దుర‍్మరణం చెందారు.

బుధవారం ఉదయం గమనించిన స్థానికులు కార్మికుల మృతదేహాలను వెలికితీశారు. మృతులు గ్రామానికి చెందిన షుకూర్‌ సాబ్‌(60), ఫాతిమ(50), నయాజ్‌(5)లుగా గుర్తించారు. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement