పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఒక బాలిక ఆత్మహత్యకు యత్నించింది.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఒక బాలిక ఆత్మహత్యకు యత్నించింది. పట్టణానికి చెందిన ఎం. ముత్యాలరావు కుమార్తె లావణ్య(16) స్థానికంగా పదో తరగతి చదువుకుంటోంది. ఆమె సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కొద్దిసేపటి తర్వాత చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పారు. అప్పటికే ఆమె శరీరం 90 శాతం మేర కాలింది. క్షతగాత్రురాలిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా, ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.