లారీ ఢీ కొని వ్యక్తి మృతి | The death of the person who bought a lorry collided | Sakshi
Sakshi News home page

లారీ ఢీ కొని వ్యక్తి మృతి

Mar 27 2015 9:44 PM | Updated on Sep 2 2017 11:28 PM

వేగంగా వెళ్తున్న లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు.

గూడూరు(నెల్లూరు జిల్లా): వేగంగా వెళ్తున్న లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి నెల్లూరు జిల్లా గూడూరు మండలం పోడ్‌పాలెం సర్కిల్ సమీపంలో జరిగింది. వివరాలు.. గూడూరు మండలం రాణిపేట గ్రామానికి చెందిన బండి లక్ష్మయ్య (65) వాటర్ ప్లాంట్‌లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా వేగంగా వస్తున్న లారీ తన టీవీఎస్ ఎక్సైల్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement