పింఛన్ తీసుకోవడానికి బ్యాంకుకు వచ్చిన రిటైర్డ్ ఉద్యోగి క్యూ లైన్లో మృత్యువాత పడ్డాడు
పింఛన్ కోసం వచ్చి క్యూలో ఉండగా గుండెపోటు
విజయవాడ సెంట్రల్ : పింఛన్ తీసుకోవడానికి బ్యాంకుకు వచ్చిన రిటైర్డ్ ఉద్యోగి క్యూ లైన్లో మృత్యువాత పడ్డాడు. విజయవాడ నగరపాలక సంస్థ వెహికిల్ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహించిన రెడ్డి సత్యనారాయణ (70) పింఛన్ తీసుకునేందుకు శనివారం నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలోని ఎస్‌బీఐ బ్యాంక్‌కు వచ్చారు.
క్యూలైన్లో నిలబడి ఉండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. క్యూలైన్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు 108కి సమాచారం అందించారు. సుబ్బారావును పరీక్షించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు.