రసాభాసగా విజయవాడ కౌన్సిల్ సమావేశం | Sakshi
Sakshi News home page

రసాభాసగా విజయవాడ కౌన్సిల్ సమావేశం

Published Thu, May 17 2018 6:05 PM

Tension in Vijayawada Municipal Council Meeting - Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడ మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా మారింది. గురువారం జరిగిన కౌన్సిల్‌ మీటింగ్‌లో ప్ర్యతేక హోదాపై చంద్రబాబు అవలంభిస్తున్న రెండు నాలుకల ధోరిణిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్లు నిలదీశారు. దీంతో ఇద్దరు కార్పొరేటర్లను కౌన్సిల్‌ నుంచి మేయర్‌ కోనేరు శ్రీధర్‌ సస్సెండ్‌ చేశారు. దీంతో సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా మున్సిపల్‌ హాల్‌లోనే వైఎస్సార్‌సీపీ సభ్యులు షేక్‌ బీజన్‌ బీ, జమల పూర్ణమ్మ దీక్ష చేపట్టారు. వారికి మద్దతుగా మిగిలిన కార్పొరేటర్లు దీక్షలో కూర్చుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ.. తమకు మేయర్‌ క్షమాపణ చెప్పే వరకు దీక్ష కొనసాగిస్తామన్నారు. హోదాపై చంద్రబాబు తప్పులను ఎత్తిచూపుతామనే భయంతోనే తమను సస్పెండ్‌ చేశారన్నారు.

హోదాకు వెన్నుపోటు పొడిచిన టీడీపీనే.. నేడు కౌన్సిల్‌లో ఏకగ్రీవ తీర్మానం చేస్తామంటే ఎవరు నమ్ముతారని నిలదీశారు. తీర్మానం చేసే ముందు హోదాపై కౌన్సిల్‌లో చర్చ జరగాలన్నారు. నాలుగు సంవత్సరాల పాటు హోదాను ఏనాడు పట్టించుకోని చంద్రబాబు, ఈ రోజు హోదా గురించి మాట్లాడడం ప్రజలను మోసాగించడమేనని దుయ్యబట్టారు. హోదా కోసం పోరాటం చేసిన వైఎస్పార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టించిన బాబు, ఇప్పుడు హోదా కోసం మాట్లాడటం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. హోదాపై అనేక సార్లు యూ టర్న్ తీసుకున్న చంద్రబాబు ప్రజలకు ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
 

Advertisement
Advertisement