గుంటూరు జిల్లాలో కిడ్నాప్‌కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది.
తెనాలి : గుంటూరు జిల్లాలో కిడ్నాప్‌కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. తెనాలి మారీస్‌పేటలో రెండు రోజుల క్రితం ఇంటి దగ్గర ఆడుకుంటున్న నిఖిల్ రెడ్డి(2) అనే చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
నిఖిల్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. స్థానిక సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఫుటేజీలో ఓ వ్యక్తి నిఖిల్ రెడ్డిని తీసుకువెళ్తున్నట్లు స్పష్టంగా కనపడింది. ఆ దిశగా పోలీసులు కేసును దర్యాప్తు చేయడంతో కేసు కొలిక్కి వచ్చింది. విజయవాడ సమీపంలో నిఖిల్‌రెడ్డిని పోలీసులు గుర్తించారు. చిన్నారి ఆచూకీ తెలియడంతో నిఖిల్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.