రచయిత్రి గోవిందరాజు సీతాదేవి మృతి

రచయిత్రి గోవిందరాజు సీతాదేవి మృతి


హైదరాబాద్: రచయిత్రి గోవిందరాజు సీతాదేవి(82) గురువారం ఉదయం సోమాజిగూడలోని ఆమె స్వగృహంలో కన్నుమూశారు. ఆమె 300కు పైగా చిన్నకథలు, 21 నవలలు రాశా రు. సుందర స్వప్నం, ఆలయం, పూలవాన, దేవుడు బ్రతికాడు తదితర నవలలు ప్రముఖమైనవి.ఆమె రాసిన తాతయ్య గర్ల్‌ఫ్రెండ్, ఆశలపల్లకి నవలలు సినిమాలుగా వచ్చాయి. అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్న సీతాదేవికి భర్త గోవిందరాజు సుబ్బారావు, కుమారులు రామకృష్ట, గోపాలకృష్ట, రమణ, శశిధర్ కుమార్తె సుభద్రాదేవి ఉన్నారు. రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి సీతాదేవికి సొంత చెల్లెలు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top