
పటిష్ట భద్రత మధ్య ఢిల్లీ చేరిన తెలంగాణ బిల్లు
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం ఉదయం ఢిల్లీకి చేరింది.
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం ఉదయం ఢిల్లీకి చేరింది. బిల్లుతో పాటు బిల్లును తిరస్కరిస్తూ సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా అధికారులు తీసుకెళ్లారు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు విభజన బిల్లును పోస్ట్‌లోనో.. కొరియర్‌లోనో కాకుండా.. ప్రత్యేక విమానంలో పంపుతున్నట్లు అధికారులు చెప్పారు.
సచివాలయం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తరలించిన అధికారులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపారు. తొమ్మిది పెట్టెల్లో 35 బండిల్స్‌తో బిల్లును ఏడుగురు అధికారుల బృందం ఉదయం ఆరు గంటల సమయంలో ఢిల్లీకి తీసుకెళ్లారు. సచివాలయ ప్రత్యేక అధికారి రామకృష్ణరావు పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ఇండిగో ఫ్లైట్‌లో ఢిల్లీకి తీసుకెళ్తారు.
అనంతరం ఏడున్నర గంటలం సమయంలో మరో 20బాక్సుల్లో బిల్లు ప్రతులను పరిపాలన శాఖ అధికారి రామరాజు నేతృత్వంలో బిల్లును తరలించారు. బిల్లుతో పాటు -బిల్లును తిరస్కరిస్తూ సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా అధికారులు పంపారు.