
వైఎస్సార్ సీపీ బ్యానర్‌కు అడ్డంగా ఏర్పాటు చేసిన టీడీపీ బ్యానర్
లింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామంలో గురువారం టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. గ్రామానికి మంత్రులు వస్తున్న సందర్భంగా టీడీపీ కార్యకర్తలు బస్టాండు సమీపంలో బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. అయితే వైఎస్సార్‌సీపీ గ్రామ నాయకులు ఏర్పాటు చేసిన బ్యానర్ కనిపించకుండా టీడీపీ కార్యకర్తలు వారి బ్యానర్‌ను ఏర్పాటు చేయడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఈ సమయంలో లింగాల ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి చొరవ తీసుకొని ఘర్షణను నివారించారు. మంత్రులు వచ్చి వెళ్లాక బ్యానర్‌ను తొలగింపజేస్తామని ఎస్‌ఐ హామీ ఇవ్వడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు శాంతించారు.