ఏది ఉన్మాదమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ పోస్టులు చూస్తుంటేనే మనకు అర్ధమైపోతుంది.
ఏది ఉన్మాదమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ పోస్టులు చూస్తుంటేనే మనకు అర్ధమైపోతుంది. పొలిటికల్ పంచ్, వైఎస్సార్సీపీ అభిమానుల పోస్టులలో సునిశితమైన హాస్యం, వ్యంగ్యం, సమ కాలీన రాజకీయాంశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండగా.. తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల పోస్టులు ఎంతో అసభ్యకరంగా ఉన్నాయి. వారు ఎంత ఉన్మాద పూరితంగా ఉన్నారో అర్ధమౌతుంది. ఫొటోలను మార్ఫింగ్ చేయడమే కాక, అసభ్య కరమైన పదజాలాన్ని ఉపయోగించారు.
మరణించినవారి గురించి దుర్భాషలాడరాదన్న కనీస ఇంగితాన్ని కూడా మరచిపోయారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను మాత్రమే కాక ఆయన కుటుంబ సభ్యులను, మహిళలను కూడా కించపరుస్తూ, అసభ్యపదజాలం ఉపయోగిస్తూ, అవాస్తవాలను పోగుచేసి పోస్టులు పెట్టారు. ఇలాంటి అనేక వందల పోస్టులపై అనేక సందర్భాలలో ఫిర్యాదు చేసినా రాష్ట్రప్రభుత్వం, పోలీసులు పట్టించు కోలేదని వైఎస్సార్సీపీ నాయకులంటున్నారు.