టవేరా బోల్తా:నలుగురు అయ్యప్ప భక్తుల మృతి | Tavera roll over: Four Ayyappa devotees died | Sakshi
Sakshi News home page

టవేరా బోల్తా:నలుగురు అయ్యప్ప భక్తుల మృతి

Dec 26 2014 3:55 AM | Updated on Sep 2 2017 6:44 PM

వైఎస్ఆర్ జిల్లా దువ్వూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు.

పొద్దుటూరు: వైఎస్ఆర్ జిల్లా దువ్వూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలుకు చెందిన అయ్యప్ప భక్తులు టవేరా వాహనంలో శబరిమలై వెళ్లారు.

 తిరుగు ప్రయాణంలో దువ్వూరు సమీపంలోకి వచ్చిన తరువాత వారు ప్రయాణిస్తున్న టవేరా వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గాయపడిన ఇద్దరిని పొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement