పశ్చిమ గోదావరి జిల్లా తాడెపల్లిగూడెం నిట్లో సీట్ల సంఖ్యను 120 నుంచి 540కు పెంచారు.
హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా తాడెపల్లిగూడెం నిట్లో సీట్ల సంఖ్యను 120 నుంచి 540కు పెంచారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే వరంగల్ నిట్ సీట్ల అంశాన్ని పరిష్కరించింది.
తాడెపల్లిగూడెం నిట్లో 540 సీట్లకుగాను 300 ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. మిగిలిన 240 సీట్లను జాతీయ కోటాలో భర్తీ చేస్తారు. ఇక వరంగల్ నిట్లో మొత్తం 740 సీట్లు ఉండగా, తెలంగాణ విద్యార్థులకు 370 సీట్లు కేటాయించారు. మిగిలిన 370 సీట్లను జాతీయ కోటాలో భర్తీ చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది.