సుందరయ్య స్ఫూర్తిగా సమస్యలపై పోరాటం | Sundarayya inspiring fight for issues | Sakshi
Sakshi News home page

సుందరయ్య స్ఫూర్తిగా సమస్యలపై పోరాటం

May 20 2016 5:10 AM | Updated on Aug 13 2018 8:10 PM

సుందరయ్య స్ఫూర్తిగా సమస్యలపై పోరాటం - Sakshi

సుందరయ్య స్ఫూర్తిగా సమస్యలపై పోరాటం

పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తిగా సమస్యలపై ఉద్యమాలు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్, జిల్లా....

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుల పిలుపు
పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాలలు

 
కర్నూలు సిటీ : పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తిగా సమస్యలపై ఉద్యమాలు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పుచ్చలపల్లి సుందరయ్య 31వ వర్ధంతి సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యం లో గురువారం ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లు ఆర్పిం చారు. పార్టీ కార్యకర్తలందరూ సుందరయ్య చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాల్జేస్తున్నాయన్నారు.

ఒక పార్టీ తరుఫున గెలిచిన వారు సొంత ప్రయోజనాల కోసం అధికార పార్టీలోకి మారుతుండడం ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయడమేనన్నారు. పార్టీ కార్యకర్తలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నా రు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, రాజశేఖర్, నగర కార్యదర్శి గౌస్ దేశాయ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ,ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మల, అలివేలమ్మ, అరుణ, సుజా త, సీఐటీయూ నగర నాయకులు రాముడు, అంజిబాబు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement