అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళ పార్లమెంట్ వద్ద విద్యార్థినులు ఆందోళనకు దిగారు.
అమరావతి:
అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంట్ వద్ద విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పార్టిస్పెషన్ సర్టిఫికెట్లు ఇవ్వటంలో వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టిస్పెషల్ సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వరంటూ మండిపడ్డారు.
పార్లమెంటరీ సదస్సు లో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విద్యార్థినులు ఆగ్రహం వెలిబుచ్చారు. సర్దిచెప్పటానికి ప్రయత్నించిన పోలీస్ కమిషనర్ సవాంగ్‌తో అర్దగంటకు పైగా విద్యార్థినులు వాదనకు దిగారు. సర్టిఫికెట్టు ఇచ్చేంత వరకు కదిలేది లేదని సభా ప్రాంగణంలోనే విద్యార్థినులు నిలబడ్డారు.