కేసుల నుంచి తప్పించుకునేందుకే ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు ప్రత్యేక హోదా విషయం పట్టించుకోవటం లేదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.
విశాఖపట్నం: కేసుల నుంచి తప్పించుకునేందుకే ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు ప్రత్యేక హోదా విషయం పట్టించుకోవటం లేదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయాన్ని నీతి ఆయోగ్కు అప్పగించామన్న కేంద్రం, నెల రోజులైనా స్పష్టత ఇవ్వలేదన్నారు.
ఈ నెల 25లోగా ప్రత్యేక హోదా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం ప్రకటించాలి, లేదంటే ఈ నెల 26న వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష తప్పదని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందని చెప్పారు. జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించటంతోనే మా ఎన్నికల విజయ ప్రస్థానం ప్రారంభమవుతుందన్నారు.