యువతకు ఉపాధి కల్పించడమే సీఎం ఆకాంక్ష: వెంకట్‌

Skill Development Centre Inaugurated By Times Group In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: క్రీస్తు రాజపురంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) ప్రెసిడెంట్‌ మేడపాటి వెంకట్‌ మంగళవారం ప్రారంభించారు. టైమ్స్‌ గ్రూప్‌, ఏపీఎన్‌ఆర్టీ సౌజన్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ.. యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష అని తెలిపారు. ఏపీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం ఏపీఎన్‌ఆర్‌టీతో టైమ్స్‌ గ్రూప్‌ ఎంఓయూ కుదుర్చుకుందని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఏపీలో టైమ్స్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో మొదటి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని విజయవాడలో ప్రారంభించడం శుభపరిణామన్నారు. తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో సైతం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలను  టైమ్స్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top