బైక్‌లపై వీర విహారం చేస్తూ ఆ మార్గంలో వచ్చిపోయే వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకులపై పోలీసులు కొరడా ఝళిపించారు.
డెంకాడ (విజయనగరం) : బైక్‌లపై వీర విహారం చేస్తూ ఆ మార్గంలో వచ్చిపోయే వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకులపై పోలీసులు కొరడా ఝళిపించారు. ఆదివారం విశాఖ నుంచి విజయనగరం జిల్లా పైడి భీమవరం వరకు జాతీయ రహదారిపై కుర్రాళ్లు బైక్ రేసింగులకు దిగారు. సమాచారం అందుకున్న విజయనగరం జిల్లా డెంకాడ పోలీసులు రంగంలోకి దిగి ఆరుగురు యువకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు.