
సాక్షి, కడప: సాహసోపేతంగా యువకుడిని కాపాడిన రిమ్స్ ఎస్సైను జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి అభినందించారు. రెండు రోజుల క్రితం పాలకొండలో తేనెటీగల దాడిలో గాయపడిన యువకుడ్ని తన భుజంపై మోసుకుని కొండ కిందకు రిమ్స్ ఎస్సై తెచ్చిన విషయం విధితమే. ఎస్సై సమయస్పూర్తితో వ్యవహరించిన కారణంగా తేనేటీగల బారిన పడిన యువకుడు ప్రాణాలతో బయట పడ్డాడు. దీంతో విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా రిమ్స్ ఎస్సై, సిబ్బందికి రివార్డు అందజేశారు.