'సీమాంధ్ర' సమావేశానికి దూరంగా పలువురు మంత్రులు, ఎంపిలు | Several Ministers & MP are away from 'Seemandhra' meeting | Sakshi
Sakshi News home page

'సీమాంధ్ర' సమావేశానికి దూరంగా పలువురు మంత్రులు, ఎంపిలు

Sep 14 2013 4:46 PM | Updated on Sep 1 2017 10:43 PM

పలువురు కేంద్ర మంత్రులు, ఎంపిలు ఈ ఉదయం జరిగిన సీమాంధ్ర నేతల సమావేశానికి హాజరుకాలేదు.

హైదరాబాద్: పలువురు కేంద్ర మంత్రులు, ఎంపిలు ఈ ఉదయం జరిగిన సీమాంధ్ర నేతల సమావేశానికి హాజరుకాలేదు.  సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు, తెలంగాణపై కేంద్రం ముందుకు వెళుతున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలు శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్లోని క్లబ్ హౌజ్లో  సమావేశమైన విషయం తెలిసిందే.  కేంద్రమంత్రులు కిషోర్‌ చంద్రదేవ్, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణితోపాటు  ఎంపీలు రాయపాటి సాంబశివరావు, చింతా మోహన్‌, హర్షకుమార్ సబ్బం హరి, టి.సుబ్బరామిరెడ్డి, నేదురమల్లి జనార్ధన రెడ్డి,  బొత్స ఝాన్సీ, రత్నాబాయి సమావేశానికి  దూరంగా ఉన్నారు.

ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు,జేడీ శీలం, పల్లంరాజు, పురంధేశ్వరి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంతవెంకట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, కేవీపీ రామచంద్ర రావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement