వేర్వేరుగానే ఇంటర్ పరీక్షలు | separate Intermediate exams for Andhra pradesh, Telangana state | Sakshi
Sakshi News home page

వేర్వేరుగానే ఇంటర్ పరీక్షలు

Dec 8 2014 1:35 PM | Updated on Sep 2 2017 5:50 PM

వేర్వేరుగానే ఇంటర్ పరీక్షలు

వేర్వేరుగానే ఇంటర్ పరీక్షలు

ఇంటర్మీడియెట్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేర్వేరుగా నిర్వహించనున్నాయి. తెలంగాణలో మార్చి 9వ తేదీ

హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేర్వేరుగా నిర్వహించనున్నాయి. తెలంగాణలో మార్చి 9వ తేదీ నుంచి,11వ తేదీ నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారమిక్కడ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ అంగీకరించటం లేదన్నారు.

విభజన చట్టాన్ని కేసీఆర్ తుంగలో తొక్కుతున్నారని ఆయన మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ఒక మెట్టు దిగేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తమిళనాడు తరహాలోనే ఎంసెట్ నిర్వహించాలని యోచిస్తున్నట్లు గంటా తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement