
బొత్స ఇంటిపై దాడికి యత్నం, టియర్ గ్యాస్ ప్రయోగం
సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరంలో తీవ్రస్థాయిలో జరుగుతున్నఉద్యమం రణరంగాన్ని తలపిస్తోంది.
సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరంలో తీవ్రస్థాయిలో జరుగుతున్నఉద్యమం రణరంగాన్ని తలపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యమకారులు శనివారం మరోసారి బొత్స ఇంటిపై దాడికి యత్నించారు. పట్టణంలోని జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ కార్యాలయాన్ని తగులబెట్టడంతో మంటలు చెలరేగాయి.
ఆందోళనకారుల్ని అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. సమైక్యవాదులు పోలీసులపై రాళ్లు రువ్వరు. ఈ సంఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఎనిమిది బైకులు, మూడు పోలీసులు జీపులు ధ్వంసమయ్యాయి.