రూ.9 కోట్ల భూకబ్జాకు యత్నం | Rs 9 crore in the attempt to take the land | Sakshi
Sakshi News home page

రూ.9 కోట్ల భూకబ్జాకు యత్నం

Sep 7 2015 2:30 AM | Updated on Sep 3 2017 8:52 AM

రూ.9 కోట్ల భూకబ్జాకు యత్నం

రూ.9 కోట్ల భూకబ్జాకు యత్నం

తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో జాతీయ రహదారికి సమీపంలోని రూ.9 కోట్ల విలువైన ప్రభుత్వ

అడ్డుకున్న రెవెన్యూ     అధికారులు
హెచ్చరిక బోర్డు ఏర్పాటు

 
 తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో జాతీయ రహదారికి సమీపంలోని రూ.9 కోట్ల విలువైన ప్ర భుత్వ భూమిని అధికార పార్టీకి చెంది న ఓ చోటా నాయకుడు కబ్జా చేసేం దుకు యత్నించాడు. అధికారులు సదరు భూమిలో హెచ్చరిక బోర్డులు ఏర్పా టు చేశారు. అధికార అండతో ఆ కబ్జాదారుడు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం విమర్శలకు తావిచ్చింది.  

బినామి పేరు చెప్పి..
తుమ్మలగుంటలోని సర్వే నంబర్ 46/5, 7, 8లో మొత్తం 86 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. రెవెన్యూ రికార్డు ల్లో ఇది అనాధీనం భూమిగా రికార్డయింది. దానిపై అదే పంచాయతీకి చెందిన ఓచోట నాయకుడి కన్ను పడిం ది. అతడు గతంలో టీడీపీ, కాంగ్రెస్, టీడీపీ ఇలా మూడుముక్కలాట ఆడిన ట్టు తెలుస్తోంది. మొదట్లో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అనుచరుడుగా ఉన్న అతడు ఇటీవల ఎమ్మెల్సీ పదవి రావడంతో గాలి ముద్దుకృష్ణమనాయుడు పంచన చేరినట్టు సమాచా రం. అధికార అండతో స్థానికంగా ఉన్న దళితులను బినామీలుగా చూపు తూ అతడు కబ్జాకు యత్నించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 46/5, 7, 8లో రెండు రోజుల క్రితం రాత్రికి రాత్రే ఇళ్లు నిర్మించేందుకు యత్నించా డు. దీనిపై మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అనుచరులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యం లో రూరల్ తహశీల్దార్ యుగంధర్ తన సిబ్బందితో ఇళ్లు నిర్మించేందుకు తీసిన పునాదులను శనివారం పూడ్చివేశారు. పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు దొడ్ల కరుణాకర్‌రెడ్డి తన అనుచరులతో వచ్చి రెవెన్యూ, పంచాయతీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. రైతులు నిర్మించుకుంటున్న ఇళ్లను అడ్డుకుంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమి లో ఆక్రమణలకు దిగితే క్రిమినల్ కే సులు పెడతామని అధికారులు హెచ్చరించడంతో వారు వెనక్కు తగ్గారు. ఆ పై రెవెన్యూ అధికారులు ఆ భూమిలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.
 
అది ప్రభుత్వ భూమే..
 తుమ్మలగుంటలోని సర్వే నంబర్ 46/5, 7, 8లోని 86 సెంట్లు ప్రభుత్వ భూమే. అందులో ఎవరు ప్రవేశించినా క్రిమినల్ కేసులు పెడతాం. అందులో ఉన్న ఆక్రమణలు అన్నీ కూల్చివేస్తాం.
 - యుగంధర్, తహశీల్దార్, తిరుపతి రూరల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement