రూ.25 కోట్లతో సెంట్రల్ డెల్టా కాలువల మరమ్మతులు | Sakshi
Sakshi News home page

రూ.25 కోట్లతో సెంట్రల్ డెల్టా కాలువల మరమ్మతులు

Published Sun, Mar 1 2015 12:42 AM

Rs 25 crore in the Central Delta drainage repairs

 ఆత్రేయపురం : సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువల అభివృద్ధి పనులకు రూ.25 కోట్లు మంజూరైనట్టు ఇరిగేషన్ ఎస్‌ఈ సుగుణాకరరావు వెల్లడించారు. పేరవరం, ఉచ్చిలి ఎత్తిపోతల పథకాలను ఆయన శనివారం పరిశీలించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ సెంట్రల్ డెల్టా పరిధిలోని పేరవరం, ఉచ్చిలి ఎత్తిపోతల పథకాలు శిథిలావస్థకు చేరాయన్నారు. సెంట్రల్ డెల్టాలో రూ.25 కోట్లతో పనులు చేసేందుకు నిర్ణయించామన్నారు. మార్చి 31 నాటికి కాలువ ద్వారా నీటిని నిలుపుదల చేసి పనుల అనంతరం జూన్ 15న నీరు విడుదల చేస్తామన్నారు.
 
 వైఎస్ హయాంలోనే డెల్టా ఆధునికీకరణ : చిర్ల
 ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ, అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.3300 కోట్లతో గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు ప్రారంభించామన్నారు. జిల్లాకు రూ. 1685 కోట్లు మంజూరు చేయించానన్నారు. ఆయన హయంలో కొన్ని పనులు చురుకుగా పూర్తి కాగా అనంతరం నత్తనడకన సాగుతున్నాయన్నారు. తాను గత ఏడాది అక్టోబర్ 22న లొల్ల లాకులవద్ద నిపుణుల కమిటీ బృందం సభ్యులు రిటైర్డు సీఈలు రోశయ్య, సుబ్బారావు, వీరయ్య చౌదరి తదితరులతో పర్యటించి పనుల మంజూరుకు కృషి చేసినట్టు తెలిపారు.
 

Advertisement
Advertisement