40 మంది ఎర్ర కూలీల అరెస్ట్ | rosewood smugglers are arrested | Sakshi
Sakshi News home page

40 మంది ఎర్ర కూలీల అరెస్ట్

May 16 2014 12:03 AM | Updated on Sep 26 2018 5:59 PM

40 మంది ఎర్ర కూలీల అరెస్ట్ - Sakshi

40 మంది ఎర్ర కూలీల అరెస్ట్

ఎర్రచందనం చెట్లను నరికేందుకు గురువారం కర్ణాటక బస్సులో తిరుపతికి వస్తున్న 40 మంది ఎర్రకూలీలను అటవీశాఖాధికారులు అరెస్ట్ చేసి బస్సును సీజ్ చేశారు.

కర్ణాటక ఆర్టీసీ బస్సు సీజ్

తిరుపతి, న్యూస్‌లైన్: ఎర్రచందనం చెట్లను నరికేందుకు గురువారం కర్ణాటక బస్సులో తిరుపతికి వస్తున్న 40 మంది ఎర్రకూలీలను అటవీశాఖాధికారులు అరెస్ట్ చేసి బస్సును సీజ్ చేశారు. వివరాలిలా.. అటవీశాఖాధికారులకు అందిన ముందస్తు సమాచారం మేరకు చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని పాకాలవారి పల్లె వద్ద దాడులు నిర్వహించారు. ఆ మార్గంలో కర్ణాటక ఆర్టీసి బస్సులో తిరుపతి వైపు వస్తున్న 40మంది ఎర్రకూలీలను అదుపులోకి తీసుకున్నారు. భోజన సామగ్రి, పనిముట్లను ఎర్రకూలీల నుంచి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక ఆర్టీసీ బస్సును సీజ్ చేశారు. నిందితులను, బస్సును తిరుపతి అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ఈ దాడుల్లో యాంటీపోచ్ స్క్వాడ్ ఇన్‌చార్జ్ రేంజ్ ఆఫీసర్ రమణ, స్క్వాడ్ అధికారులు జి.మునికృష్ణరాజు, తులసయ్య, ప్రొటెక్షన్ వాచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement