breaking news
rose wood
-
40 మంది ఎర్ర కూలీల అరెస్ట్
కర్ణాటక ఆర్టీసీ బస్సు సీజ్ తిరుపతి, న్యూస్‌లైన్: ఎర్రచందనం చెట్లను నరికేందుకు గురువారం కర్ణాటక బస్సులో తిరుపతికి వస్తున్న 40 మంది ఎర్రకూలీలను అటవీశాఖాధికారులు అరెస్ట్ చేసి బస్సును సీజ్ చేశారు. వివరాలిలా.. అటవీశాఖాధికారులకు అందిన ముందస్తు సమాచారం మేరకు చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని పాకాలవారి పల్లె వద్ద దాడులు నిర్వహించారు. ఆ మార్గంలో కర్ణాటక ఆర్టీసి బస్సులో తిరుపతి వైపు వస్తున్న 40మంది ఎర్రకూలీలను అదుపులోకి తీసుకున్నారు. భోజన సామగ్రి, పనిముట్లను ఎర్రకూలీల నుంచి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక ఆర్టీసీ బస్సును సీజ్ చేశారు. నిందితులను, బస్సును తిరుపతి అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ఈ దాడుల్లో యాంటీపోచ్ స్క్వాడ్ ఇన్చార్జ్ రేంజ్ ఆఫీసర్ రమణ, స్క్వాడ్ అధికారులు జి.మునికృష్ణరాజు, తులసయ్య, ప్రొటెక్షన్ వాచర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వేకోడూరు అర్బన్, న్యూస్‌లైన్: డంప్‌చేసి ఉన్న 90 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు కోడూరు రేంజ్ అధికారి వి.నరసింహులు తెలిపారు. స్థానిక అటవీకార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాజంపేట డీఎఫ్ఓ నాగార్జునరెడ్డి సమాచారం మేరకు తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఉర్లగడ్డపోడు రైల్వేబ్రిడ్జి పక్కన డంప్ చేసి ఉన్న దుంగలను పట్టుకున్నామన్నారు.పట్టుబడ్డ దుంగల విలువ రూ.2లక్షలు చేస్తాయన్నారు. ఈ దాడుల్లో డీఆర్ఓ జీడీ మద్దిలేటి, చిట్వేలి అటవీ శాఖ అధికారి శ్రీరాములు, వారి సిబ్బంది పాల్గొన్నారన్నారు.