ఎర్రచందనం దుంగలు స్వాధీనం | rose wood seized | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Mar 25 2014 2:47 AM | Updated on Sep 2 2017 5:07 AM

ఎర్రచందనం దుంగలు

ఎర్రచందనం దుంగలు

డంప్‌చేసి ఉన్న 90 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు కోడూరు రేంజ్ అధికారి వి.నరసింహులు తెలిపారు.

రైల్వేకోడూరు అర్బన్, న్యూస్‌లైన్: డంప్‌చేసి ఉన్న 90 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు కోడూరు రేంజ్ అధికారి వి.నరసింహులు తెలిపారు. స్థానిక అటవీకార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాజంపేట డీఎఫ్‌ఓ నాగార్జునరెడ్డి సమాచారం మేరకు తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఉర్లగడ్డపోడు రైల్వేబ్రిడ్జి పక్కన డంప్ చేసి ఉన్న దుంగలను పట్టుకున్నామన్నారు.పట్టుబడ్డ దుంగల విలువ రూ.2లక్షలు చేస్తాయన్నారు. ఈ దాడుల్లో డీఆర్‌ఓ జీడీ మద్దిలేటి, చిట్వేలి అటవీ శాఖ అధికారి శ్రీరాములు, వారి సిబ్బంది పాల్గొన్నారన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement