ఆదాయంలో రిజిస్ట్రేషన్ శాఖ దూకుడు | Revenue from the aggression of the Department of Registration | Sakshi
Sakshi News home page

ఆదాయంలో రిజిస్ట్రేషన్ శాఖ దూకుడు

Jan 14 2016 12:11 AM | Updated on Sep 3 2017 3:37 PM

గడిచిన తొమ్మిది నెలల్లో జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాలయాల ఆదాయం ఇలా ఉంది.

 గడిచిన తొమ్మిది నెలల్లో జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాలయాల ఆదాయం ఇలా ఉంది.
  నెల్లిమర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ లక్ష్యం కోటీ 86 లక్షల రూపాయలు. కాగా రికార్డు స్థాయిలో రూ.5 కోట్ల ఆదాయం సాధించింది. 268.92 శాతంతో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
  రెండో స్థానంలో నిలిచిన కురుపాం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం రూ.39 లక్షలు. రూ.71 లక్షల ఆదాయం సాధించింది.
 
  చీపురుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం 2.49 కోట్ల రూపాయలు కాగా, రూ.4.320 కోట్ల రాబడితో మూడోస్థానంలో నిలిచింది.
 
  సాలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ లక్ష్యం రూ.3.12 కోట్లు కాగా.. రూ.5.19 కోట్లు సాధించింది.   గజపతినగరం కార్యాలయం లక్ష్యం 3.44 కోట్ల రూపాయలు కాగా.. రూ.5 కోట్లు సంపాదించింది.  విజయనగరం పశ్చిమ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం రూ.16.53 కోట్లు కాగా.. రూ.23 కోట్ల రెండు లక్షల ఆదాయంసాధించి 139.26 శాతంతో ఆరో స్థానంలో నిలిచింది.
 
  తెర్లాం కార్యాలయ లక్ష్యం ఒక కోటీ34 లక్షల రూపాయలు కాగా.. కోటీ 83 లక్షల రూపాయలు సంపాదించింది.
 
  కొత్తవలస కార్యాలయం లక్ష్యం 11 కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు కాగా.. 14.96 కోట్ల రూపాయల ఆదాయంతో 134.86 శాతం పొంది ఎనిమిదో స్థానంలో నిలిచింది.
 
  ఎస్.కోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు కాగా.. నాలుగు కోట్ల 37 లక్షల రూపాయలు సాధించింది.
 
  పార్వతీపురం కార్యాలయం లక్ష్యం ఆరు కోట్ల ఏడు లక్షల రూపాయలు కాగా, రూ.6 కోట్ల 82 లక్షల ఆదాయాన్ని సముపార్జించింది.
 
  భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లక్ష్యం రూ.25.37 కోట్లు కాగా రూ.27.21 కోట్లు సాధించి 107 శాతం ఆదాయంతో 11వ స్థానంలో నిలిచింది.  బొబ్బిలి కార్యాలయం లక్ష్యం 7.98 కోట్ల రూపాయలు కాగా 8.52 కోట్లు సంపాదించింది.

  విజయనగరం ఆర్‌వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మాత్రం లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. లక్ష్యం 24.79 కోట్ల రూపాయలు కాగా.. రూ.23.45 రూపాయలు మాత్రమే సంపాదించింది. 94.58 శాతం ఆదాయంతో చివరి స్థానంలో నిలిచింది. తొమ్మిది నెలల కాలంలో జిల్లాలో ఉన్న 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వందశాతం నుంచి 200 శాతం పైబడి ఆదాయం సాధించడం విశేషం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement