అర్ధరాత్రి అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న తమిళ కూలీలు తారసపడ్డారు.
రూ. 5 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
Jan 8 2016 11:02 AM | Updated on Sep 3 2017 3:19 PM
సుండుపల్లి: అర్ధరాత్రి అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న తమిళ కూలీలు తారసపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఓ వ్యక్తి చిక్కాడు. మరో ఎనిమిది మంది కూలీలు పరారయ్యారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లి పరిధిలోని పుంచ అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
అడవిలోని ముత్తుకుంట సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఎర్రకూలీల మాటలు వినిపించడంతో అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా కూలీలు తమ వద్ద ఉన్న దుంగలను పడేసి పరారయ్యారు. ఈ క్రమంలో మురుగన్ అనే తమిళ కూలీని పోలీసులు అరెస్ట్ చేసి 9 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ సుమారు రూ. 5 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement