అటవీ అధికారులపై స్మగ్లర్లు దాడి | Red sandalwood Smugglers Attack on Forest department officers | Sakshi
Sakshi News home page

అటవీ అధికారులపై స్మగ్లర్లు దాడి

Feb 25 2014 10:00 AM | Updated on Sep 26 2018 6:01 PM

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు గత అర్థరాత్రి నుంచి తనిఖీలు నిర్వహించారు.

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు గత అర్థరాత్రి నుంచి తనిఖీలు నిర్వహించారు. అయితే ఎర్ర చందనం స్మగ్లర్లు అటవీశాఖ అధికారుల రాకను గమనించారు. దాంతో స్మగ్లర్లు తమ వెంట తెచ్చుకున్న రాళ్లును సదరు అధికారులపై రువ్వారు. అటవీశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై ఎదురుదాడికి దిగారు. దీంతో లారీలలో తరలించేందుకు సిద్దంగా ఉంచిన ఎర్రచందనాన్ని వదిలి స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు.

 

అటవీశాఖ అధికారులు తరలించేందుకు సిద్దంగా ఉంచిన ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువు రూ. కోటి ఉంటుందని అధికారులు వెల్లడించారు. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. లారీ రిజిస్ట్రేషన్ నెంబర్లు అధారంగా నిందితులను పట్టుకుంటామని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement