breaking news
devarakonda forest
-
ఆర్ఎంపీ వివాహేతర సంబంధం.. జ్యోతిని కారులో తీసుకెళ్లి..
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళను పక్కాగా ప్లాన్ ప్రకారం ఓ ఆర్ఎంపీ హత్య చేశాడు. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే పూడ్చిపెట్టేందుకు యత్నం చేశాడు. కానీ, పోలీసులు రంగం ప్రవేశం చేయడంతో ఈ ఘటన బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని గుర్రంపోడ్ మండలంలో మహేష్ అనే వ్యక్తి ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక జునూతలలో జ్యోతి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా.. వివాహేతర సంబంధానికి దారి తీసినట్టు తెలిసింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో, ఒత్తిడికి గురైన మహేష్.. జ్యోతిని అడ్డుతొలంగిచుకోవాలని చూశాడు. తాజాగా ఆమెతో మాట్లాడిన మహేష్.. బయటకు తీసుకెళ్లే నెపంతో దేవరకొండ నుంచి బాధితురాలిని తీసుకుని కారులో బయలుదేరాడు.అనంతరం, మార్గ మధ్యంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, ఆగ్రహానికి లోనైన మహేష్.. అప్పటికే తన వెంట తెచ్చుకున్న గడ్డి మందును బలవంతంగా ఆమెతో తాగించాడు. జ్యోతిని హత్య చేసేందుకు పక్కాగా ప్లాన్.. ఆమెకు విషపు ఇంజక్షన్ కూడా ఇచ్చాడు. జ్యోతి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే.. ఆమెను మట్టిలో పూడ్చిపెట్టాలని అనుకున్నాడు. అయితే, మహేష్ వెళ్తున్న కారుపై అనుమానం వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు.. అతడిని వెంబడించారు. కారును ఆపి పరిశీలించగా.. కొన ఊపిరితో ఉన్న జ్యోతిని చూసి వెంటనే.. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలోనే జ్యోతి మృతి చెందింది. అనంతరం, నిందితుడు మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. -
అటవీ అధికారులపై స్మగ్లర్లు దాడి
చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు గత అర్థరాత్రి నుంచి తనిఖీలు నిర్వహించారు. అయితే ఎర్ర చందనం స్మగ్లర్లు అటవీశాఖ అధికారుల రాకను గమనించారు. దాంతో స్మగ్లర్లు తమ వెంట తెచ్చుకున్న రాళ్లును సదరు అధికారులపై రువ్వారు. అటవీశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై ఎదురుదాడికి దిగారు. దీంతో లారీలలో తరలించేందుకు సిద్దంగా ఉంచిన ఎర్రచందనాన్ని వదిలి స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. అటవీశాఖ అధికారులు తరలించేందుకు సిద్దంగా ఉంచిన ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువు రూ. కోటి ఉంటుందని అధికారులు వెల్లడించారు. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. లారీ రిజిస్ట్రేషన్ నెంబర్లు అధారంగా నిందితులను పట్టుకుంటామని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.