
పరీక్షకు సిద్ధం
ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి.
పదవాల్తేరు, ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. మూడేళ్లుగా రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలుస్తున్న విశాఖ జిల్లాను ఈ దఫా కూడా అదే స్థాయి లో నిలపడానికి విద్యార్థులు సమాయత్తమయ్యారు. ఉజ్వల భవి ష్యత్తుకు మేలి మలుపుగా పరిగణించదగ్గ పరీక్షలకు అధ్యాపకుల అండతో సమాయత్తమైన వారు తమ సత్తా చూపడానికి సంసిద్ధులవుతున్నారు. ఈనెల 12 నుంచి 26 వరకు జరగ నున్న ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 301 జూనియర్ కళాశాలల నుంచి మొత్తం 1,00,895 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.
అర్బన్‌లో 56, రూరల్‌లో 39, ఏజెన్సీలో 16 మొత్తం 111 పరీక్ష కేంద్రాలు
ఏర్పాటు చేశారు. వీటిలో 19 పరీక్ష కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఆయా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా
నిఘా పెట్టారు. పరీక్ష
ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు అరగంట ముందే సెంటర్‌కు చేరుకోవాలి. 8.45 గంటల తర్వాత పరీక్షలకు వచ్చే అభ్యర్థులు లేట్ రిజిస్టర్‌లో ఆలస్యానికి కారణం రాసిన తర్వాతే పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. 9 గంటలు దాటితే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎల్.జె.జయశ్రీ చెప్పారు. నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లు, అయిదు సిటింగ్ స్క్వాడ్లు, ఆర్‌ఐవో, డీవీఈవో బృందాలు పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తాయని ఆమె తెలిపారు.