బీసీలను నమ్మించి మోసం చేశారు

Rajanna Dora Slams Chandrababu Naidu - Sakshi

సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర

విజయనగరం, పార్వతీపురం: బీసీ సామాజిక వర్గానికి చంద్రబాబు చేసిన మోసాన్ని తెలియజేసేందుకు గురువారం వైస్సార్‌ సీపీ అరకు పార్లమెంట్‌ జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు వాకాడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్వతీపురం డివిజన్‌ కేంద్రంలో బీసీ గర్జన నిర్వహించారు. అరకు పార్లమెంట్‌ జిల్లా పరిధి లోని సాలూరు, పార్వతీపుం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల పరిధిలోని బీసీ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా గర్జించారు. 2014 ఎన్నికల మేనిఫేస్టోలో 119 హామీలిచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. ముందుగా పార్వతీపురం పట్టణంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నుంచి వైఎస్సార్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ చంద్రబాబుకు నమ్మించి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్యగా పేర్కొన్నారు. ఏటా రూ.10 వేలు కోట్ల ఖర్చు చేస్తామని చెప్పారని, ఆ లెక్కను ఐదేళ్లకు రూ.50 వేలు కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. బాబు పాలనలో బీసీలకు ఎంత అన్యాయం జరిగిందో అందరికీ తెలిసిందేనన్నారు. బీసీ మంత్రి కొల్లు రవీంద్ర మొద్దు నిద్రలో ఉన్నారని, బీసీల సంక్షేమానికి ఎంత ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ టీడీపీ అరాచక పాలనను అంతమొందించడానికి బీసీలంతా కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.  వైఎస్సార్‌ సీపీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు మాట్లాడుతూ బీసీలకు రూ.80 వేల కోట్లు కేటాయిస్తానని చెబుతూ మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు చూస్తున్నారన్నారు. బీసీల సత్తా ఎమిటో చంద్రబాబుకు చూపిద్దామని అరకు పార్లమెంటరీ జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు వాకాడ నాగేశ్వరరావు అన్నారు. ఆదరణ పథకం అవినీతిమయమైందని, నాణ్యతలేని పరికరాలు పంపిణీ చేస్తూ టీడీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని కొల్లగొడుతోందన్నారు. వైఎస్సార్‌ సీపీ అరకు పార్లమెంటరీ నేత పాలవలస విక్రాంత్, జిల్లా బీసీసెల్‌ మహిళా అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి, పట్ణణ అ«ధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, విశ్వబ్రాహ్మణ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు ముగడ  జగన్‌మోహన్, బీసీ నేత వంగపండు క్రిష్ణ, సాలూరు మత్స్యకార ప్రతినిధి పాండ్రంకి అచ్చిబాబు తదితరులు మాట్లాడారు. బీసీలను చిన్నచూపు చూస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చివేసి వైఎస్సార్‌ సీపీని గద్దెనెక్కిద్దామన్నారు. అనంతరం బీసీల అనచివేతను నిరసిస్తూ ఆర్డీఓ కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందజేశారు.

ఈ బీసీ గర్జనలో వైఎస్సార్‌సీపీ సినియర్‌ నాయకులు  జమ్మాన ప్రసన్నకుమార్,రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మంత్రి రవికుమార్, మువ్వల సత్యం నాయుడు, బలగ నాగేశ్వరావు, మండల పకీరునాయుడు, గుంట్రెడ్డి దామోదరావు, వల్లేపు చిన్నారావు, ఆర్‌వీ పార్థసారథి, బోను రామినా యుడు, ఉరిటి రామారావు, మూడడ్ల రామారావు, డి.జనార్దనరావు, శెట్టి నాగేశ్వరరావు, వి.సూర్యనారాయణ థాట్రాజ్, పోలా ఈశ్వరనారాయణ, బి.సత్యనారాయణమూర్తి, బి.శ్రీ రాములునాయడు, టి.సత్యనారా యణ, డి.అప్పలనాయు డు, ఆర్‌.బి.నాయుడు, బి.తమ్మినాయుడు, జె.శ్రీదేవి, గంగయ్య, గోపినాయుడు, మజ్జి శేఖర్, వై.తిరుపతి, బొమ్మి రమేష్, వై.ప్రతాప్, మజ్జి శేఖర్, సీహెచ్‌.సత్యనారాయణ, ఎన్‌.బలరాం, ఎం.గణేష్, అల్లం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top