అదిగదిగో.. ఆశల బండి కూత

Railway Budget Announcement Tomorrow in Union Budget 2020 - Sakshi

రైల్వే బడ్జెట్‌ కోసం ఎదురు చూపు

ఏటా నిరాశపరుస్తున్న కేంద్రం

ప్రయాణికులకు దారిలేని కృష్ణపట్నం లైన్‌

సర్వేలకే పరిమితమవుతున్న రైల్వేలైన్లు

ముందుకెళ్లనిబెంగళూరు లైను  

వైఎస్‌ఆర్‌ జిల్లా,రాజంపేట: కేంద్ర ప్రభుత్వం రేపు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఏటా మాదిరిగానే జిల్లా ప్రజానీకం ఈ బడ్జెట్‌ అయినా తమ ఆకాంక్షలను నెరవేరుస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వారి ఆశలపై నీళ్లు చల్లుతుందో..తీపి కబురు చెబుతుందో తెలియడానికి మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. గతేడాది రైల్వేబడ్జెట్‌  జిల్లా ప్రజలను నిరాశ పరిచింది. నిధుల కేటాయింపులో కోతలు విధించింది. జిల్లాలో రైల్వేపరమైన అభివృద్ధి విషయంలో వివక్ష కొనసాగుతోందనేది జనం భావన. ఏళ్లతరబడి  ప్రాజెక్టులు పెండింగులోనే కొనసాగుతూనే ఉన్నాయి. మూడుదశాబ్దాల తర్వాత నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వేలైన్‌ అందుబాటులోకి వచ్చినా కొత్తరైళ్లు జిల్లా వైపు కన్నెత్తి చూడటంలేదు.  కడప, రాజంపేట, నందలూరు, ఎర్రగుంట్ల, రైల్వేకోడూరు రైల్వేస్టేషన్లలో మౌలిక వసతులు అంతంత మాత్రంగా ఉన్నాయి. పలురైళ్లు జిల్లాలో ఆగకుండానే వెళుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడు రాజధానికి లింక్‌గా డీఎంయు రైళ్లను నడిపించాల్సిన అవసరముందనేది దీర్ఘకాలిక కోరిక. అదీ నెరవేరడం లేదు. వీక్లీ, బైవీక్లీ లాంటి రైళ్లకు స్టాపింగ్‌ ఇవ్వాలన్న వినతులు రైల్వే ఉన్నతాధికారులు పెడచెవిన పెడుతున్నారు. రాజంపేట, రైల్వేకోడూరులో ఆర్‌యూబీలునిర్మాణంలో జాప్యం కొనసాగుతోంది. కొన్ని రైల్వేస్టేషన్‌లో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు లేవు. ప్రయాణీకుల సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయి.

జిల్లా కు రైల్వేపరిశ్రమ కలేనా..
నందలూరు రైల్వేకేంద్రంలో ప్రత్యామ్నాయ రైల్వేపరిశ్రమ ఏర్పాటు కలగానే మిగిలింది. ఎన్‌డీఏ హయాంలో ఇది కార్యరూపం దాల్చుతుందని జిల్లా వాసులు ఆశించారు. కేంద్రంలో ప్రభు త్వాలేవి మారినా ఈ పరిశ్రమ ఊసెత్తడంలేదు. నందలూరులో రైల్వేపరిశ్రమ ఏర్పాటుచేయాలని కొన్నేళ్లుగా నానుతు న్న విషయం. రాజంపేట ఎంపీ మిధునరెడ్డి లోక్‌సభలో దీనిపై  ప్రస్తావించారు. 250 క్వార్టర్స్‌తో పాటు 150 ఎకరాలు రైల్వేభూమి ఉంది. భూమి విషయంలో ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. గతంలో రైల్వేమంత్రిగా పనిచేసిన లాలు ప్రసాద్‌యాదవ్‌  వ్యాగన్‌ రిపేరువర్క్‌షాపు పెడతామని ప్రకటించారు. కానీ తర్వాత విస్మరించారు. 

బెంగళూరు లైన్‌ నిర్మాణం ముందుకెళ్లేదెపుడో...
 2008–09 రైల్వేబడ్జెట్‌లో కడప–బెంగళూరు రైల్వేలైను రైలుమార్గాన్ని ప్రకటించారు. ఈ మార్గం పూర్తికావడానికి అంచనా రూ.2050 కోట్లకు చేరుకుంది. 2010 సెప్టెంబరులో అప్పటి రైల్వేమంత్రి మునియప్ప శంకుస్ధాపన చేశారు. 21.8కిలోమీటర్ల మేర తొలిదశపనులు పూర్తయ్యాయి. అక్కడి వరకు డెమోరైలు నడిపిస్తున్నారు. రెండో వదశలో పెండ్లిమర్రి నుంచి రాయచోటి, లక్కిరెడ్డిపల్లె మీదుగా చిత్తూరు జిల్లా వాయల్పాడువరకు పనులు చేయాల్సి ఉంది. 102వ లైను చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఈమార్గంలో పదిశాతం పనులే జరిగాయి. 

ప్రయాణీకుల రవాణకు నోచుకోనికృష్ణపట్నం రైల్వేలైన్‌
వైఎస్సార్‌ జిల్లా, నెల్లూరు జిల్లాలను కలిపే కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైల్వేలైన్‌ సరకు రవాణకే పరిమితమైంది. ప్రయాణీకులకు ఈ మార్గంలో వెళ్లే అవకాశం లెేఛీజీ ఈ రైల్వేలైన్‌కు ఇప్పటి వరకు రూ.1186కోట్లు ఖర్చు చేశారు. ఇది కూడా అంచనా రూ.1646కోట్లకు చేరుకుంది. వెంకటాచలం–ఓబులవారిపల్లె మధ్య మార్గం పూర్తయి గూడ్స్‌రైళ్లకే పరిమితమైంది.

సర్వేలకే రైలుమార్గాలు
కంభం–ప్రొద్దుటూరు రైల్వేలైన్‌ సర్వే కు గతబడ్జెట్‌లో.1లక్ష మాత్రమే కేటాయించారు. ఈ లైన్‌ సర్వే దశను దాట
భాకరాపేట–గిద్దలూరు రైల్వేలైన్‌ గురించి గత బడ్జెట్‌లో ప్రస్తావనే లేదు. జిల్లాలో రెండు కొత్త రైలుమార్గాలు సర్వేలకే పరిమితమైయ్యాయి.  
కడప–గుంతకల్లు–బళ్లారి రైల్వేలైన్‌ సర్వేకు బడ్జెట్‌ ఆమోదం తెలిపింది. ఇప్పటికే కడప–గుంతకల్లు మధ్య డబుల్‌లైన్‌ నిర్మితమైంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి ఈ లైను అనువుగా ఉంటుంది. సర్వే చేపట్టేందుకు ఆమోదం లభించినా అడుగు ముందుకు పడలేదు.  
భాకరాపేట–గిద్దలూరు రైల్వేలైన్‌ కూడా సర్వేలకే పరిమితమైంది. ఈ కొత్త రైలుమార్గం పురోగతి ప్రశ్నార్ధకరంగా మారింది.     
జిల్లా కేంద్రంతో సంబంధం లేకుండా ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్‌లో రాజధానికి రైలునడుస్తోంది.
జిల్లా కేంద్రం నుంచి రాజధానికి రేణిగుంట మీదుగా వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలు ఒక్కటే దిక్కయింది.

నంద్యాల రైల్వేలైన్‌విద్యుద్దీకరణ ఎప్పుడో..
కర్నూలు, వైఎస్సార్‌జిల్లాలను కలుపుతూఏర్పాటైన ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్‌నువిద్యుద్దీకరణ (ట్రాక్షన్‌) చేయనున్నారు. రూ.20కోట్లు కేటాయించారు. 123 కిలోమీటర్ల మార్గంలో దీనివల్ల కరెంటురైలింజన్లు నడిచే అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది. ట్రాక్షన్‌ పూర్తి కావాలంటే రూ111.48కోట్లు వ్యయం చేయాలి.  ఇంకా సర్వేదశలోఈ మార్గం విద్యుద్దీకరణ పనులున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top