'ప్రజల ముందు టీడీపీ దోషిగా నిలబడింది' | Raghuveera reddy takes on TDP president chandrababu naidu | Sakshi
Sakshi News home page

'ప్రజల ముందు టీడీపీ దోషిగా నిలబడింది'

May 31 2015 1:06 PM | Updated on Aug 18 2018 9:13 PM

'ప్రజల ముందు టీడీపీ దోషిగా నిలబడింది' - Sakshi

'ప్రజల ముందు టీడీపీ దోషిగా నిలబడింది'

52 పేజీల మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వాటి అమలును గాలికొదిలేశారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు.

గుంటూరు:  52 పేజీల మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వాటి అమలును గాలికొదిలేశారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఆదివారం గుంటూరులో రఘువీరా టీడీపీ ఏడాది పాలనపై వాస్తవ పత్రం విడుదల చేశారు. అనంతరం రఘువీరా మాట్లాడుతూ... అప్పుల ఊబిలో చిక్కుకుని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బాబు వచ్చే, కరువు తెచ్చేనని రైతులు అనుకుంటున్నారని తెలిపారు. రాజధాని రైతుల భూములను ఇతర దేశాలకు 99 ఏళ్లకు కట్టబెట్టడం దారుణమని ఆరోపించారు. టీడీపీ ఇచ్చిన హామీలపై ఆ పార్టీ నేతలకు ఖలేజా ఉంటే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని రఘువీరా డిమాండ్ చేశారు. ప్రజల ముందు టీడీపీ దోషిగా నిలబడిందని అన్నారు. జూన్ 8వ తేదీ తర్వాత టీడీపీపై కాంగ్రెస్ పార్టీ ప్రజాయుద్ధం ప్రకటించబోతుందని రఘువీరా స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement