ప్రజా పంపిణీ 'డీలా'ర్లు | Public distribution Dealers | Sakshi
Sakshi News home page

ప్రజా పంపిణీ 'డీలా'ర్లు

Dec 27 2015 1:37 AM | Updated on Sep 2 2018 4:48 PM

ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ నానాటికీ నిర్వీర్యం అవుతోంది. గత ప్రభుత్వం పంపిణీ చేసిన నిత్యావసర

శ్రీకాకుళం టౌన్ : ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ నానాటికీ నిర్వీర్యం అవుతోంది. గత ప్రభుత్వం పంపిణీ చేసిన నిత్యావసర సరుకులు ఇప్పుడు కనిపించడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  వచ్చిన కొత్త విధానంవల్ల డీలర్లకు కొత్త తలనొప్పులు వచ్చి చేరాయి. కమిషన్లు పెంచక పోగా  సాంకేతిక కారణాల వల్ల ఉన్న రేషన్ కార్డులు తొలగిస్తూ గ్రామాలకు సరిపడా సరకులు ఇవ్వడం లేదు. దీంతో డీలర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమలు, గోధుమపిండి మాత్రమే సరఫరా చేయాలని నిర్ణయించినా పెరిగిన ధరల వల్ల అవికూడా అందని పరిస్థితి నెలకొంది. కేవలం బియ్యం, పంచదారకే ప్రజాపంపిణీ వ్యవస్థ పరిమితమవుతోంది.
 
 డీలర్ల నెత్తిన నిర్వహణ వ్యయం
 డీడీలకు బ్యాంకుల్లో కమిషన్ చెల్లించినా ఆ మొత్తాలు డీలర్లకు చెల్లించడం లేదు. దీనికి తోడు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న రె వెన్యూ అధికారులకు మామూళ్లు, డిపో నిర్వహించడానికి అవసరమైన గోదాంలు, ఇద్దరు హమాలీలు, కరెంటు బిల్లులు, అన్‌లోడింగ్ చార్జీలు, తూనికలు కొలతలశాఖ మామ్మూళ్లు,  వెరసి ఒక్కోడీలరుకు రూ.5000వరకు ఖర్చు అవుతోంది. రూ.50 మెట్రిక్‌టన్నుల బియ్యం పంపిణీ చేస్తే క్వింటా ఒక్కింటికి రూ.20మాత్రమే పౌరసరఫరాలశాఖ కమిషన్‌గా చెల్లిస్తోంది.
 
 లబ్థిదార్లకు కావాల్సిందేమిటి?
 జిల్లా వ్యాప్తంగా తెల్లరేషన్ కార్డులు,అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిపి 7.56లక్షల వరకు ఉన్నాయి. అందుకోసం 12,484,084 కిలోల బియ్యం, 7,32,561కిలోల పంచదార,7,55,793కిలోల కందిపప్పు, 37,77,690 కిలోలు,గోధుమపిండి 37,77,751కిలోల వంతున నిత్యం సరఫరా చేయాల్సిఉంది. గోధుమలు, గోధుమ పిండి కొనుగోలు అంతంత మాత్రమే ఉండడంతో వాటిని డీలర్ల వద్ద నెలల తరబడి ఉండిపోతున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement