సైకో వీరంగం...! | Psycho virangam in parvatipuram | Sakshi
Sakshi News home page

సైకో వీరంగం...!

Aug 7 2014 2:27 AM | Updated on Sep 2 2017 11:28 AM

సైకో వీరంగం...!

సైకో వీరంగం...!

పార్వతీపురం పట్టణంలో ఓ సైకో బుధవారం వీరంగం సృష్టించాడు. ముఖమంతా గాయాలతో, కన్నులొట్టపోయి, తలపై తీవ్రగాయాలతో నెత్తురోడుతూ పట్టణంలోని బెలగాం మొదలుకుని

 పార్వతీపురం : పార్వతీపురం పట్టణంలో ఓ సైకో బుధవారం వీరంగం సృష్టించాడు. ముఖమంతా గాయాలతో, కన్నులొట్టపోయి, తలపై తీవ్రగాయాలతో నెత్తురోడుతూ పట్టణంలోని బెలగాం మొదలుకుని మెయిన్ రోడ్డులోని పాత బస్టాండు, రాయగడ రోడ్డులో కలియదిరుగుతూ ప్రజల్ని భయకంపితుల్ని చేశాడు. దీంతో పాటు చినదేవర వీధి, దండంగి వీధి, భారత భవనం వీధి, తూర్పు వీధి తదితర వీధుల్లో సుడిగాలిలా తిరుగు తూ కనిపించిన మహిళలపై దాడికి తెగబడ్డాడు. దీంతో నెత్తురోడుతున్న సైకోను చూసిన మగవాళ్లు సైతం భయభ్రాంతులకు గురై పరుగులంకించారు. దీంతో చొక్కా విప్పి, ఆచొక్కాను చేత చుట్టూ తిప్పుతూ...వీధుల్లోని ఇళ్ల గేట్లు తీసుకుంటూ దూరేందుకు యత్నించగా, అంతా భయంతో తలుపులు వేసుకున్నారు.
 
 దీంతోపాటు మెయిన్ రోడ్డులోని షాపుల్లోకి దూరేందుకు యత్నించగా షాపులొది లేసి బయటకు పరుగులంకించారు. సైకో వీరంగాన్ని అడ్డుకునేందుకు పలువురు యువకులు ప్రయత్నించినా వారిపై దాడికి తెగబడడంతో వారు పట్టణ ఎస్సై వి.అశోక్ కుమార్‌కు సమాచారమందించారు. అప్పటికే బాగా అలిసిపోయిన సైకో మెయిన్ రోడ్డులో ఓ షాపు ముందు సేద తీరుతుండగా ఎస్సై తన సిబ్బంది సునీల్, లక్ష్మీనారాయణతో వచ్చి సైకో ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూసిన సైకో ఒడియాతోపాటు అర్థం కాని గిరిజన భాషలో మాట్లాడడంతో, పోలీసులు తాగు నీరు, తిండి పెట్టి చిరునామా తెలుసుకుని సాయంత్రం టౌన్ రైల్వే స్టేషన్‌లో బొకారో రెలైక్కించారు. దీంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement