చదువుకునే అవకాశం కల్పించండి! | Provide the opportunity to study | Sakshi
Sakshi News home page

చదువుకునే అవకాశం కల్పించండి!

May 21 2015 4:28 AM | Updated on Sep 3 2017 2:23 AM

చదువుకునే అవకాశం కల్పించండి!

చదువుకునే అవకాశం కల్పించండి!

తల్లిదండ్రులు ఆ బాలికకు బాల్య వివాహం చేశారు...

వరదయ్యుపాళెం: తల్లిదండ్రులు ఆ బాలికకు బాల్య వివాహం చేశారు. మెట్టినింట్లో కాపురం చేయలేక కొద్ది రోజులకే పుట్టినింటికి చేరింది. పుట్టింటి వారు పట్టిం చుకోకపోవడంతో తనను హాస్టల్‌లో చేర్పించి చదువుకునే అవకాశం కల్పించాలని ఆ బాలిక బుధవారం మధ్యాహ్నం వరదయ్యుపాళెం ఎంపీడీవో హుమ్రత్‌ను ఆశ్రరుంచింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం, రాగవారిపాళెం గ్రావూనికి చెందిన ఈశ్వరయ్యు, వుునెవ్ముకు  మూగ్గురు కువూర్తెలు. ఈశ్వరయ్యు అనారోగ్యంతో ఐదేళ్ల క్రితం మృతి చెందాడు. భర్త మృతితో మునెవ్ము తన ముగ్గురు కువూర్తెలను సమీప బంధువులకిచ్చి పెళ్లి చేసింది. మూడో కుమార్తె అనుష్క ఎనిమిదో తరగతి చదువుతుండగా 8 నెలల క్రితం బలవంతంగా శ్రీకాళహస్తి సమీపంలోని రంగాయుగుంట గ్రావూనికి చెందిన వెంకటేశుకు ఇచ్చి పెండ్లి చేసింది.

ఆమె 3 నెలలకే భర్తతో కాపురం చేయులేక తల్లి వద్దకు చేరింది. తల్లి పట్టించుకోకపోవడంతో అనుష్క శ్రీసిటి సెజ్‌లో ఓ ఫ్యాక్టరీలో దినసరి కూలి పనులు చేసుకుంటోంది. అత్తింటి వారు ఆమెను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండడంతో బుధవారం మధ్యాహ్నం ఎంపీడీవోను ఆశ్రయించింది. తనకు బలవంతపు బాల్య వివాహం చేశారని, చదువుకోవాలని ఉందని, హాస్టల్‌లో చేర్పించి కొత్త జీవితాన్ని ప్రసాదించాలని కోరింది. వివరాలు సేకరించి బాలికను ఐసీడీఎస్ సిబ్బందికి అప్పగించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement