వేసవి రక్షణ చర్యలపై టీటీడీ జేఈవో సమీక్ష | Protection for devotees visiting to tirumala | Sakshi
Sakshi News home page

వేసవి రక్షణ చర్యలపై టీటీడీ జేఈవో సమీక్ష q

May 6 2015 2:56 AM | Updated on Aug 11 2018 3:38 PM

వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల రక్షణ చర్యలపై టీటీడీ జేఈవో...

తిరుమల : వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల రక్షణ చర్యలపై టీటీడీ జేఈవో కెఎస్.శ్రీనివాసరాజు మంగళవారం స్థానిక అన్నమయ్య భవనంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఈ వేసవిలో ఎక్కువ సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారని, అన్ని విభాగాల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేసవిలో భక్తులకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులను అవసరమైనంత స్టాక్ ఉంచుకోవాలని వైద్యాధికారిని ఆదేశించారు.

ఘాట్‌రోడ్డులోని పలు ప్రదేశాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నీటిని నింపాల్సిన అవసరముందని ఆటవీ శాఖాధికారులకు సూచించారు. తిరుమలలోని వంట చెరుకు డిపోను రింగురోడ్డు ప్రాంతానికి మార్పు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులకు శిక్షణ కార్యక్రమాన్ని మరింత మెరుగుపరచాలన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ 1, 2, ఇతర ప్రాం తాల్లో వృథాగా ఉన్న కుర్చీలు, బల్లలు తదితర సామగ్రిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.

వర్షం కురిసినప్పుడు ఏటీసీ ప్రాంతంలో ఎక్కువగా వర్షపు నీరు నిలిస్తోందని, భక్తులకు ఇబ్బంది లేకుం డా సత్వరం తొలగించే చర్యలు చేపట్టాల న్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్‌ఈ- శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఈ(ఎలక్ట్రికల్) శ్రీవేంకేటశ్వర్లు, అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ శివారెడ్డి, ట్రాన్స్‌పోర్టు జీఎమ్ శేషారెడ్డి, డీఎఫ్‌వో శివరాంప్రసాద్, డెప్యూటీఈవో కోదండరామారావు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement