సాగర్ కుడి కాలువకు నీటి సరఫరా నిలుపుదల | powerhouse problem in sagar power station | Sakshi
Sakshi News home page

సాగర్ కుడి కాలువకు నీటి సరఫరా నిలుపుదల

Feb 11 2015 5:42 PM | Updated on Sep 2 2017 9:09 PM

నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటి విడుదల పూర్తి స్థాయిలో నిలిచిపోయింది.

గుంటూరు: నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటి విడుదల పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. ఇప్పటి వరకు విద్యుదుత్పత్తి ద్వారా 4 వేల క్యూసెక్కుల నీటిని హెడ్ రెగ్యులేటర్ ద్వారా కుడి కాలువకు విడుదల చేస్తున్నారు. అయితే బుధవారం ఉదయం 11 గంటలకు సంబంధిత పవర్‌హౌస్ టర్బయిన్‌లో శబ్ధాలు వచ్చాయి.

దీంతో ప్రాజెక్టు అధికారులు నీటి విడుదల నిలిపివేశారు. ఈ ఘటనను ఏపీ ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నీరు నిలుపుదలతో కుడి కాలువ పరిధిలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(మాచెర్ల టౌన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement