చిత్తూరులో రూ. కోటిన్నర విలువైన ఎర్రచందనం పట్టివేత | Police seize red sandalwood worth Rs. 1.5 crore at vedurukuppam | Sakshi
Sakshi News home page

చిత్తూరులో రూ. కోటిన్నర విలువైన ఎర్రచందనం పట్టివేత

Oct 24 2013 10:41 AM | Updated on Sep 1 2017 11:56 PM

చిత్తూరు జిల్లాలోని వెదరుకుప్పం వద్ద అక్రమంగా తరలిస్తున్న 8 టన్నుల ఎర్రచందనాన్ని ఈ రోజు తెల్లవారుజామున పటుకున్నట్లు అటవీశాఖ అధికారులు గురువారం ఇక్కడ వెల్లడించారు.

చిత్తూరు జిల్లాలోని వెదరుకుప్పం వద్ద అక్రమంగా తరలిస్తున్న 8 టన్నుల ఎర్రచందనాన్ని ఈ రోజు  తెల్లవారుజామున పటుకున్నట్లు  అటవీశాఖ అధికారులు గురువారం ఇక్కడ వెల్లడించారు. అందుకు సంబంధించి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నాట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకోవడం ఇదే ప్రధమం అని అటవీశాఖ అధికారులు తెలిపారు.

 

స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్లో రూ. కోటిన్నర వరకు ఉంటుందని చెప్పారు. స్మగ్లర్లను పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. స్మగ్లర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే ఎర్రచందనాన్ని తరలించేందుకు ఉపయోగించిన వాహనాలను పోలీసు స్టేషన్కు తరలించి సీజ్ చేసినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement