గ్యాంగ్‌ వార్ కేసులో మరో ముందడుగు

Police Investigation Speed Up In Gang war case  - Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడ పటమటలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌ వార్‌కు సంబంధించిన కేసులో పోలీసులు పట్టు బిగుస్తున్నారు. వివాదానికి కారణమైన ల్యాండ్ ఓనర్స్ శ్రీధర్ రెడ్డి ,ప్రదీప్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్‌ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు తెలిపారు. పోలీసులు నిందితులను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. కాగా ఇది వరకే గ్యాంగ్‌ లీడర్‌ పండుతో పాటు రెండు గ్రూపులకు చెందిన 33 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు‌ తరలించిన విషయం తెలిసిందే. పరారిలో ఉన్న మిగతా 15 మంది నిందితుల కోసం ఆరు ప్రత్యేక​ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top