
సేవాపన్ను బకాయిలు చెల్లించండి: చిదంబరం
పన్ను ఎగవేతదారులు ఈ నెల 31లోగా 50 శాతం పన్ను కడితే పెనాల్టీ కేసులు ఉండవని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు.
హైదరాబాద్: పన్ను ఎగవేతదారులు ఈ నెల 31లోగా 50 శాతం పన్ను చెల్లించాలని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కోరారు. సేవాపన్ను అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 17లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, 7 లక్షల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని తెలిపారు.
2007 అక్టోబరు నుంచి 2012 డిసెంబర్ 31 వరకు బకాయిపడిన సేవాపన్ను చెల్లించాలని కోరారు. బకాయిపడిన సేవాపన్నులో 50 శాతం ఈ నెల 31లోగా చెల్లించి, మిగిన 50 శాతం జూన్ 30లోగా చెల్లించాలని తెలిపారు.