పాతపద్ధతిలోనే గ్యాస్ ఇప్పించండి | PIL filed in high court for Gas subsidies not mandatory Aadhaar card | Sakshi
Sakshi News home page

పాతపద్ధతిలోనే గ్యాస్ ఇప్పించండి

Nov 30 2013 1:07 AM | Updated on Sep 2 2017 1:06 AM

ఆధార్‌తో సంబంధం లేకుండా రాయితీ గ్యాస్ సిలిండర్లను వినియోగదారులకు సరఫరా చేసేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.

 హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు
 సాక్షి, హైదరాబాద్: ఆధార్‌తో సంబంధం లేకుండా రాయితీ గ్యాస్ సిలిండర్లను వినియోగదారులకు సరఫరా చేసేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది బాలాజీ వధేరా శుక్రవారం దీన్ని దాఖలు చేశారు.
 
 ఆధార్ కార్డుతో అనుసంధానిస్తూ గ్యాస్ రాయితీ మొత్తాన్ని వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమచేసే విధానంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషనర్ పిల్‌లో నివేదించారు. చమురు సంస్థలు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్‌కు రూ. 1,050 వసూలు చేస్తున్నాయని, సబ్సిడీ మొత్తాన్ని తర్వాత బ్యాంక్ ఖాతాలో వేస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే సబ్సిడీ కింద రూ. 412లకే గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసేలా చమురు సంస్థలను ఆదేశించాలని కోరారు. ఈ పిల్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement