చంద్రబాబు, లోకేష్‌ అవినీతి పిటిషన్‌​ ఉపసంహరణ

PIL Filed Against Nara Lokesh In High Court On Coruption - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్‌ పై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఐటీశాఖలో రూ. 23వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ సీబీఐ, ఈడీ విచారణ కోరుతూ మాజీ న్యాయమూర్తి శ్రావణ్‌ కుమార్‌ ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం విచారించిన ధర్మాసనం.. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో రావాలని పిటిషనర్‌కు సూచించడంతో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆరోపణలు చేస్తున్న కంపెనీల పూర్తి వివరాలు తెలపాలని పిటిషనర్‌ను కోర్టు కోరింది. ఆర్టీఏ ద్వారా సమాచారం కోరిన తనకు ఇవ్వడం లేదని పిటిషనర్‌ హైకోర్టుకు తెలిపారు.

పిటిషన్‌ నేపథ్యం..
ఐటీ శాఖలో రూ. 25 వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్‌పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అవినీతిపై సీబీఐ, ఈడీ విచారణ కోరుతూ మాజీ న్యాయమూర్తి శ్రావణ్‌ కుమార్‌ ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేశారు.  ఏపీఎన్‌ఆర్టీ చైర్మన్‌ వేమూరి రవికుమార్‌, మాజీ ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాధరెడ్డితో కలిసి ఈ అవినీతికి పాల్పడ్డారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. దొంగ ఎంవోయూలతో వేల ఎకరాల భూమిని ధారదత్తం చేశారని, దీని ద్వారా లబ్ది పొంది భారీ ఎత్తున ఆస్తులను పెంచుకున్నారని పిటినర్‌ తెలిపారు. అర్హత లేని కంపెనీలతో ఒప్పందం జరుపుకుని... నాలుగేళ్లుగా కార్యకలపాలు చేపట్టలేదని పిటిషన్‌లో వెల్లడించారు. ఐటీ కంపెనీల పేరుతో జరిగిన క్విడ్‌ ప్రోకోపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలని ఆయన హైకోర్టును కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top